: విజయానికి రెండు వికెట్ల దూరంలో టీమిండియా
భారత్‌లో న్యూజిలాండ్ క్రికెట్ టీమ్ పర్యటనలో భాగంగా ఈడెన్‌గార్డెన్స్ లో జరుగుతున్న రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో నాలుగోరోజు ఆటలో న్యూజిలాండ్ జట్టు బ్యాట్స్‌మెన్ పూర్తిగా విఫలమయ్యారు. టీమిండియా బౌలర్ల ధాటికి మైదానంలో న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్ ఎక్కువ సేపు నిలబడలేకపోయారు. క్రీజులో నిలదొక్కుకునేలా కనిపించిన రోంచి కూడా 32 పరుగులు చేసి జడేజా బౌలింగ్‌లో వెనుదిరిగాడు. ఆ తరువాత మైదానంలో అడుగుపెట్టిన జీతన్ కూడా 2 పరుగులకే భువనేశ్వర్ కుమార్ బౌలింగ్‌లో వెనుదిగాడు. దీంతో న్యూజిలాండ్ చేతిలో మరో రెండు వికెట్లు మాత్రమే ఉన్నాయి. హెన్రీ 14 పరుగులతో, వాగ్నెర్ 2 పరుగులతో క్రీజులో ఉన్నారు. విజయానికి రెండు వికెట్ల దూరంలో టీమిండియా ఉంది. న్యూజిలాండ్ స్కోర్ 186 కాగా, విజయానికి మరో 190 పరుగులు చేయాల్సి ఉంది. న్యూజిలాండ్ చేతిలో రెండే వికెట్లు ఉండడంతో భారత్ విజయం ఖాయమైంది.