: సైనికుల కంటే అతిపెద్ద హీరోలెవ్వరూ లేరు: నానాపటేకర్
సైనికుల కంటే అతిపెద్ద హీరోలు ఎవరూ లేరంటూ బాలీవుడ్ ప్రముఖ నటుడు నానా పటేకర్ తన దేశభక్తిని చాటారు. పాకిస్థాన్ కళాకారులకు బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్, దర్శక, నిర్మాత కరణ్ జొహార్ తదితరులు మద్దతుగా మాట్లాడటంపై విమర్శలు తలెత్తిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే నానాపటేకర్ మీడియాతో మాట్లాడుతూ, ‘నేను ఆర్మీలో రెండున్నరేళ్లు ఉన్నాను. అసలైన హీరోలెవరో నాకు తెలుసు. ముందు, దేశమే ముఖ్యం.. దేశం ముందు ఆర్టిస్టులు చాలా చిన్నవారు’ అంటూ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.