: చంద్రబాబు, వెంకయ్యనాయుడులిద్దరూ తోడు దొంగలు: భూమన కరుణాకర్ రెడ్డి


ఏపీ సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు లిద్దరూ తోడుదొంగలని వైఎస్సార్సీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించారు. ఓటుకు నోటు కేసులో చంద్రబాబును వెంకయ్యనాయుడు కాపాడారని, వాళ్లిద్దరూ గోబెల్స్ ను మించిన ఘనులని ఆరోపించారు. ఇద్దరూ కలిసి ఏపీ ప్రయోజనాలను గాలికొదిలేశారని, ‘ఓటుకు నోటు కేసులో చంద్రబాబు ఇరుక్కోవడం వలన తుమ్మితే ఊడే ముక్కు మాదిరిగా ఆయన ముఖ్యమంత్రి పదవి తయారవడంతో బాబు కష్టాల్లో పడ్డారు. దీంతో, వెంకయ్యనాయుడు అండదండలతో.. మోదీ కాళ్ల దగ్గర బాబు సాగిలపడి, ఆ కేసులో ఇరుక్కోకుండా ఉండేందుకు ఏపీకి ప్రత్యేక హోదా అన్న దానిని తాకట్టుపెట్టారు. ఏపీకి ప్రత్యేక ప్యాకేజ్ తో చాలా లాభం కల్గుతుందని మన మిద్దరం చెబితే నమ్మని వారెవరుంటారన్న ఉద్దేశంతో, వీళ్లిద్దరూ ఒక్కటై, ఈ తోడు దొంగలు తెలుగు ప్రజలను మోసగిస్తున్నారు. ప్రత్యేకహోదా గురించి అడిగే వాళ్ల గొంతులను ఈ తోడు దొంగలు నొక్కుతున్నారు’ అని భూమన ఆరోపించారు.

  • Loading...

More Telugu News