: ఐదేళ్ల తర్వాత పెళ్లి చేసుకుంటా: రాశీ ఖన్నా
ఐదేళ్ల తర్వాత తాను పెళ్లి చేసుకుంటానని ప్రముఖ నటి రాశీఖన్నా చెప్పింది. ఒక న్యూస్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ, తాను పెళ్లి చేసుకునే వ్యక్తి తనతో కనెక్ట్ అయితే చాలని, అంతే తప్ప, ఫలానా క్వాలిటీస్ ఉండాలి, ఉండకూడదనేది ఏమీ లేదని రాశీఖన్నా చెప్పింది. ఈ సందర్భంగా తన కెరీర్, సినిమాలు మొదలైన విషయాలను ప్రస్తావించింది. తనపై వచ్చే రూమర్స్ ను అసలు పట్టించుకోనని రాశీఖన్నా చెప్పింది. ఖాళీ సమయాల్లో తాను బయటకు ఎక్కడికీ వెళ్లనని, ఇంట్లోనే తన వాళ్లతో కబుర్లు చెబుతానని రాశీఖన్నా చెప్పుకొచ్చింది.