: రక్తానికి జాతి, మాంసానికి మతం, చర్మానికి కులం లేవు: బాలకృష్ణ


రక్తానికి జాతి, మాంసానికి మతం, చర్మానికి కులం లేవని హిందూపురం ఎమ్మెల్యే, ప్రముఖ సినీ నటుడు నందమూరి బాలకృష్ణ అన్నారు. హైదరాబాద్ లో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఉగ్రవాదులు హద్దు మీరితే, ప్రజలు సహించరని, ఉగ్రవాదాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని అన్నారు. ప్రజాస్వామ్య విలువలను గౌరవించే మనదేశంలో ప్రజలకు ఓపిక ఉందని, అయితే, ఆ ఓపికకు కూడా ఒక హద్దు ఉంటుందని చెప్పారు. ఉగ్రవాదం ప్రపంచానికే శత్రువుగా మారిందని, ఉగ్రవాదులకు తగిన విధంగా సమాధానం చెబుతామని బాలకృష్ణ అన్నారు.

  • Loading...

More Telugu News