: పాక్ గగనతలంలోకి ప్రవేశిస్తే 29వేల అడుగుల పైనే వెళ్లాలి


భారత విమానాలను పాకిస్తాన్ లక్ష్యంగా చేసుకుంది. తమ దేశ గగనతలంలోకి ప్రవేశించే విదేశీ విమానాలు తక్కువ ఎత్తులో ప్రయాణించకుండా ఆంక్షలు విధించింది. కరాచీ నగరం పైనుంచి వెళ్లాలంటే 33వేల అడుగుల ఎత్తులోనే వెళ్లాల్సి ఉంటుంది. అంతకంటే తక్కువ ఎత్తులో ప్రయాణిస్తే బలవంతంగా కిందకు దింపేస్తారు. అలాగే లాహోర్ నగరంపై 29వేల అడుగుల ఎత్తుపైనే ప్రయాణించాల్సి ఉంటుంది. ఈ ఆంక్షలకు నిర్వహణ పరమైన కారణాలను ఉదహరించింది. కరాచీపై ఆంక్షలు ఒక వారం పాటు అమల్లో ఉండనుండగా, లాహోర్ పై ఆంక్షలు మాత్రం అక్టోబర్ నెలంతా అమల్లో ఉండనున్నట్టు పాకిస్తాన్ తెలిపింది. ఈ ఆంక్షల వల్ల ప్రయాణాలు ఆలస్యమవుతాయని విమానయాన వర్గాల ఆధారంగా తెలుస్తోంది. అయితే, పాకిస్తాన్ సైనిక విమానాలు విన్యాసాలు చేయనుండడం వల్లే తక్కువ ఎత్తులో ప్రయాణించవద్దంటూ ఆంక్షలు తీసుకొచ్చినట్టు ఓ కమాండర్ తెలిపారు.

  • Loading...

More Telugu News