: వచ్చే నెల 12 నుంచి పార్లమెంటు సమావేశాలు!


ఈ ఏడాది పార్లమెంటు శీతాకాల సమావేశాలు ముందుగానే ప్రారంభం కానున్నాయి. వచ్చే నెల 12 నుంచి ఇవి ప్రారంభం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. కేంద్ర ఆర్థిక శాఖ ఈ మేరకు షెడ్యూల్ ను స్పీకర్ సుమిత్రా మహాజన్ కు పంపించింది. అందులో నవంబర్ 12 నుంచి పార్లమెంటు శీతాకాల సమావేశాలు నిర్వహించాలని ప్రతిపాదించింది. అలాగే బడ్జెట్ సమావేశాలు 2017 జనవరి 12 నుంచి నిర్వహించాలని కోరింది. ఫిబ్రవరి 1న బడ్జెట్ ను ఆర్థిక మంత్రి సభకు సమర్పిస్తారు. అదే నెల 12 నుంచి మార్చి 12 వరకు విరామం ఉంటుంది. ఆ తర్వాత బడ్జెట్ సమావేశాలు తిరిగి ప్రారంభమై అదే నెల 31తో ముగుస్తాయి. నూతన ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ 1 నాటికి బడ్జెట్ ఆమోద ప్రక్రియ పూర్తి కావాలనే ఉద్దేశంతో బడ్జెట్ సమావేశాల ప్రక్రియను ముందుకు జరపాలని కేంద్రం నిర్ణయించిన విషయం తెలిసిందే. కాగా ఈ నూతన షెడ్యూల్ త్వరలో స్పీకర్ ఆమోదం పొందవచ్చని, తర్వాత దాన్ని పార్లమెంటరీ వ్యవహరాల కేబినెట్ కమిటీకి పంపనున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి.

  • Loading...

More Telugu News