: ప్రాణం తీసిన ఈత సరదా.. హైదరాబాద్‌లో చెరువులో మునిగి విద్యార్థి మృతి


ఈత సరదా ఓ విద్యార్థి ప్రాణం తీసింది. హయత్‌నగర్ మండలం బాటసింగారంలో ఈ విషాదం చోటుచేసుకుంది. స్నేహితులతో కలిసి వెళ్లిన మనోజ్ ఈత కోసం చెరువులో దిగాడు. కేరింతలు కొడుతూ చెరువులో ఆడుతుండగా ఒక్కసారిగా మునిగిపోయాడు. మనోజ్ చెరువులో ఆడుతున్న దృశ్యాలను ఒడ్డున ఉన్న స్నేహితులు వీడియో తీశారు. ఆడుతుండగా మనోజ్ మునిగిపోవడంతో స్నేహితులు భయంతో కేకలు వేశారు. సమాచారం అందుకున్న గజ ఈతగాళ్లు వెంటనే రంగంలోకి దిగి చెరువులో గాలించారు. అప్పటికే చనిపోయిన మనోజ్ మృతదేహాన్ని బయటకు తీసుకువచ్చారు. మనోజ్ మృతితో స్థానికంగా విషాదం అలముకుంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

  • Loading...

More Telugu News