: ఈ ఫొటో చూడండి.. అచ్చు మా అమ్మ లాగానే ఉన్నాను కదూ!: మిల్కీబ్యూటీ తమన్నా
తన అందం, అభినయం, డ్యాన్సులతో ప్రేక్షకులను మైమరపిస్తున్న మిల్కీ బ్యూటీ తమన్నా తాజాగా ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసిన ఒక ఫొటో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇంతకీ, ఆ ఫొటోలో వున్న ఇద్దరిలోనూ ఒకరు తమన్నా అయితే, మరొకరు ఆమె తల్లి రజని. తన ఫొటోను, తల్లి ఫోటోను పక్కపక్కనే పెట్టి పోస్ట్ చేసింది. ‘మా అమ్మ లవ్లీ ఫొటో ఒకటి దొరికింది. అమ్మకు నేను ప్రతిరూపంగా వుండటం చాలా సంతోషంగా ఉంది... లవ్ యూ మామ్’ అంటూ ఆ ట్వీట్ లో తమన్నా పేర్కొంది.