: కరెన్సీ నోట్లు కాగితాల్లా ఎగిరి పూల వర్షం కురిసిన వేళ... కళాకారులు షాక్... వీడియో చూడండి!
‘యూరీ’ సెక్టార్ లో చోటుచేసుకున్న ఉగ్రదాడిలో మృతి చెందిన సైనికులకు నివాళులర్పించేందుకు గుజరాత్ లోని సూరత్ లో ఒక సంగీత కార్యక్రమం నిర్వహించారు. దీనికి ప్రజల నుంచి అనూహ్య స్పందన లభించింది. ఈ సంగీత కార్యక్రమం ద్వారా సేకరించిన మొత్తాన్ని యూరీ ఉగ్రదాడిలో మృతి చెందిన సైనికుల కుటుంబాలకు ఇస్తామని ఈ కార్యక్రమ నిర్వాహకులు ప్రకటించారు. అంతే, కరెన్సీ నోట్లు కాగితాల్లా ఎగిరి పూల వర్షంలా కురిశాయి. సంగీత కార్యక్రమంలో పాల్గొన్న కళకారులు కురుస్తున్న నోట్లతో షాక్ కు గురయ్యారు. ఇంత డబ్బు తమపై పడుతుండడంతో నవ్వుతూనే వారు కార్యక్రమాన్ని నిర్వహించారు. క్షణాల్లో దాదాపు కోటి రూపాయల నగదు వచ్చి పడింది. కొందరు కళాకారులపై నగదు విరజిమ్మితే, మరికొందరు విరాళంగా అందజేశారు. ఈ కార్యక్రమం ద్వారా మొత్తం 2 కోట్ల రూపాయలు సేకరించినట్లు నిర్వాహకులు తెలిపారు. అంత డబ్బు ఎలా కురిసిందో ఓ సారి మీరు కూడా చూడండి.