: మాజీ ఎంపీ షాబుద్దీన్ బెయిల్ రద్దు.. వెంటనే కస్టడీలోకి తీసుకోవాలని సుప్రీం ఆదేశాలు
వివాదాస్పద ఆర్జేడీ మాజీ ఎంపీ మహ్మద్ షాబుద్దీన్ కు పాట్నా హైకోర్టు ఇచ్చిన బెయిల్ ను భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు రద్దు చేసింది. రెండు కేసుల్లో జీవిత ఖైదు అనుభవిస్తూ, పలు కేసుల్లో విచారణ ఎదుర్కొంటున్న షాబుద్దీన్ కు పాట్నా హైకోర్టు ఇటీవల బెయిల్ మంజూరు చేసింది. దీనిని ఛాలెంజ్ చేస్తూ బీహార్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషిన్ పై ఈరోజు విచారణ చేసిన సుప్రీంకోర్టు.. షా బుద్దీన్ మళ్లీ జైలుకు వెళ్లాల్సిందేనని.. వెంటనే లొంగిపోవాలని ఆదేశించింది. షాబుద్దీన్ ను కస్టడీలోకి తీసుకునేందుకు బీహార్ ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించింది. అంతేకాకుండా, షా బుద్దీన్ నిందితుడిగా ఉన్న రాజీవ్ రోషన్ హత్య కేసు విచారణ త్వరగా పూర్తి చేయాలని అత్యున్నత న్యాయస్థానం సూచించింది.