: శంషాబాద్ విమానాశ్రయంలో హైఅలర్ట్.. ఆక్టోపస్, సీఐఎస్‌ఎఫ్ బలగాల తనిఖీలు
పాక్ టెర్రరిస్టుల యూరీ దాడికి ప్రతిగా భారత సైనికులు నియంత్రణ రేఖను దాటి పీవోకేలోని ఉగ్రస్థావరాలపై దాడులు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పాకిస్థాన్, భారత్ సరిహద్దుల్లో నెలకొన్న ఆందోళనకర పరిస్థితుల దృష్ట్యా దేశంలోని పలు సున్నిత ప్రాంతాల్లోనూ తనిఖీలు ముమ్మరం చేశారు. ఇప్పటికే హైదరాబాద్ నగరంలో భద్రతను కట్టుదిట్టం చేసిన సంగతి తెలిసిందే. నగర శివారులోని శంషాబాద్ విమానాశ్రయంలో హైఅలర్ట్ ప్రకటించారు. ఎయిర్‌పోర్టు పరిధిలో ఆక్టోపస్, సీఐఎస్‌ఎఫ్ బలగాలు రంగంలోకి దిగాయి. ఎయిర్‌పోర్టులో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహిస్తున్నాయి.