: ఘోరంగా విఫలమైన టీమిండియా టాప్ ఆర్డర్... లంచ్ విరామ సమయానికి భారత్ స్కోర్ 57/3


ఇటీవ‌ల జ‌రిగిన 500వ టెస్టులో అద్భుత విజ‌యాన్ని న‌మోదు చేసిన టీమిండియా నేడు జ‌రుగుతున్న 501వ టెస్టులో మాత్రం త‌డ‌బ‌డుతోంది. ఈరోజు కోల్‌క‌తా వేదిక‌గా న్యూజిలాండ్ క్రికెట్ టీమ్‌తో జ‌రుగుతున్న టెస్టు మ్యాచులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా ఆరంభంలోనే కీల‌క వికెట్లు కోల్పోయింది. న్యూజిలాండ్ బౌలర్లు విజృంభించ‌డంతో టీమిండియా టాప్ ఆర్డర్ ఘోరంగా విఫలమైంది. కివీస్ బౌల‌ర్లు బౌల్ట్‌, హెన్రీ బౌలింగ్ ధాటికి శిఖర్ ధావ‌న్ కేవ‌లం ఒక్క ప‌రుగు చేసి వెనుదిరిగితే, విజ‌య్ 9 ప‌రుగుల‌కే ఔట‌య్యాడు. ఇక, రాణిస్తాడ‌నుకున్న విరాట్ కోహ్లీ కూడా 9 పరుగుల‌కే వికెట్ స‌మ‌ర్పించుకున్నాడు. ప్ర‌స్తుతం క్రీజులో అజింక్యా ర‌హానే (7 పరుగులు), చటేశ్వర పుజారా(30 పరుగులు) ఉన్నారు. లంచ్ విరామ సమయానికి భారత్ స్కోర్ 57/3.

  • Loading...

More Telugu News