: లంచం తీసుకుంటుండగా మహిళా జడ్జి అరెస్ట్
ఢిల్లీలోని తీస్ హజారీ కోర్టు సీనియర్ సివిల్ జడ్జి రచనా తివారీ లఖన్ పాల్ లంచం తీసుకుంటుండగా సీబీఐ అధికారులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఆమె నివాసం నుంచి సోదాల సందర్భంగా రూ.94 లక్షలను స్వాధీనం చేసుకున్నారు. జడ్జి భర్త అలోక్ లఖన్ పాల్, న్యాయవాది విషాల్ మెహన్ లను కూడా అరెస్ట్ చేశారు. న్యాయవాది మెహన్ నుంచి గులాబిబాగ్ లోని తన నివాసం వద్ద జడ్జి రూ.4 లక్షలు తీసుకుంటుండగా అరెస్ట్ చేసినట్టు సీబీఐ అధికారులు తెలిపారు. ఓ కేసు విషయంలో బాధితుడి ఫిర్యాదు మేరకు సీబీఐ ఈ ఆపరేషన్ నిర్వహించింది. ఆమెపై అవినీతి నిరోధక చట్టంలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. జడ్జి తరఫున రూ.20 లక్షలు, తనకు మరో రూ.2 లక్షలు ఇవ్వాలని న్యాయవాది మెహన్ డిమాండ్ చేసినట్టు సీబీఐ అధికారులు తెలిపారు.