: ఢిల్లీ చేరుకున్న సీఎం చంద్రబాబు
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కొద్ది సేపటి క్రితం ఢిల్లీ చేరుకున్నారు. స్వచ్ఛ భారత్ ఉద్యమం చేపట్టి ఏడాది పూర్తయిన సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఈ రోజు వార్షికోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమంలో పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు, ప్రజాప్రతినిధులు, జిల్లా కలెక్టర్లు, 500 అమృత్ నగరాల మున్సిపల్ కమిషనర్ లు పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు ఢిల్లీ వెళ్లారు. విజ్ఞాన్ భవన్ లో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న పారిశుద్ధ్య సమ్మేళనంలో కూడా ఆయన పాల్గొంటారు.