: మ‌రో దుస్సాహ‌సం... అఖ్నూర్‌ సెక్టార్‌లో పాక్ బ‌ల‌గాల కాల్పులు


పాకిస్థాన్‌, భారత్ సరిహద్దుల్లో నెల‌కొన్న ఆందోళ‌నక‌ర ప‌రిస్థితుల‌పై భార‌త్ దీటైన జ‌వాబు ఇస్తోన్న వేళ పాక్ మ‌రోసారి దుస్సాహసం చేసింది. ఓవైపు ఇరు దేశాల మ‌ధ్య నెల‌కొన్న ప‌రిస్థితుల‌పై భార‌త్ ఇరుగుపొరుగు దేశాల‌తో పాటు అనేక దేశాలు స్పందిస్తుండ‌గా, మ‌రోవైపు పాకిస్థాన్ బ‌ల‌గాలు ఈరోజు ఉద‌యం మ‌రోసారి కాల్పుల విర‌మ‌ణ ఒప్పందాన్ని ఉల్లంఘించి, భార‌త్‌ను రెచ్చ‌గొట్టే ప్ర‌యత్నాలు చేశాయి. జమ్ముకశ్మీర్ అఖ్నూర్‌ సెక్టార్‌లోని చప్రియల్‌, సమ్వాన్‌ ప్రాంతాల్లో ఈరోజు ఉదయం పాక్ బ‌ల‌గాలు కాల్పులు జ‌రిపాయి. ఈ ఘ‌ట‌న‌లో ఎవ‌రికీ ఎలాంటి హానీ జ‌ర‌గ‌లేదు. ప్ర‌స్తుతం అక్క‌డి ప‌రిస్థితి అదుపులోనే ఉంద‌ని జమ్ము డిప్యూటీ కమిషనర్‌ సిమ్రన్‌దీప్‌ సింగ్ పేర్కొన్నారు. గడిచిన 48 గంటల్లో ఐదోసారి పాక్‌ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది.

  • Loading...

More Telugu News