: చరిత్రలో ఈ మూడు సర్జికల్ స్ట్రయిక్స్ చిరస్థాయిగా నిలుస్తాయి!!
ప్రపంచ చరిత్రలో మూడు సర్జికల్ స్ట్రయిక్స్ చిరస్థాయిగా నిలిచాయని మాజీ సైనికాధికారులు గుర్తు చేసుకుంటున్నారు. ఇండియన్ ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ దళాలు నిన్న రాత్రి సంయుక్తంగా చేపట్టిన సర్జికల్ స్ట్రయిక్ విజయవంతం కావడంతో వారు గతాన్ని గుర్తుచేసుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆ మూడు సూపర్ సర్జికల్ స్ట్రయిక్స్ వివరాల్లోకి వెళ్తే... ఉగాండాకు చెందిన హైజాకర్లు ఓ విమానాన్ని హైజాక్ చేసి అందులో పాలస్తీనీయులు, ఇజ్రాయేలీలను బందీలుగా పట్టుకున్నారు. వారిని యూదులు, యూదేతరులుగా రెండు వర్గాలుగా విభజించి, ఇజ్రాయెల్ తో బేరసారాలకు దిగారు. నాలుగు రోజుల చర్చ అనంతరం ఐదోరోజు ప్రణాళికలు రచించిన ఇజ్రాయెల్ కమెండోస్ ఆరోరోజు యుద్ధ హెలికాప్టర్ లో ఉగాండాకు వెళ్లి, హైజాకర్లు, నియంత సైన్యాన్ని మట్టుబెట్టి, బందీలుగా ఉన్నవారిని విడిపించి తమ విమానంలో ఎక్కించుకుని వెనుదిరిగారు. ఇదే ప్రపంచంలో అత్యుత్తమ సర్జికల్ స్ట్రయిక్! ఇదే తరహాలో సర్జికల్ స్ట్రయిక్స్ ఇజ్రాయెల్ కొన్ని వందలు చేసి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఆ తరువాత మరో విమానాన్ని హైజాక్ చేసిన దుండగులు మొగదిషులో విమానాన్ని దించి బేరసారాలకు దిగినప్పుడు జర్మన్ సేనలు క్షణాల్లో దిగి, వారిని మట్టుబెట్టి బందీలను విడిపించడం ప్రపంచంలో రెండో అత్యుత్తమ సర్జికల్ స్ట్రయిక్. కాగా, ప్రపంచంలో మూడో అత్యుత్తమ సర్జికల్ స్ట్రయిక్, ఒసామా బిన్ లాడెన్ ను పాకిస్థాన్ ఆర్మీ స్థావరానికి కూత వేటు దూరంలో ఉన్న అబోటాబాద్ లో అమెరికా సేనలు హతమార్చి శవాన్ని తీసుకెళ్లి సముద్రంలో పడెయ్యడం. ఇక చరిత్రలో నిలిచిపోయేలా నాలుగో సర్జికల్ స్ట్రయిక్ కూడా పాకిస్థాన్ భూభాగంలోనే ఎల్ఓసీ సమీపంలో నిన్న రాత్రి భారత్ ఆర్మీ చేబట్టిన ఆపరేషన్ నిలిచిపోతుంది!