: మేము వేరే దేశంపై దాడికి దిగితే అది దురాక్రమణ... మా భూభాగంలోనే సర్జికల్ స్ట్రయిక్స్ చేశాం: ఆర్మీ


లైన్ ఆఫ్ కంట్రోల్ దాటి మరీ పీవోకేలో అడుగుపెట్టిన ఇండియన్ ఆర్మీ ఉగ్రవాదులను మట్టుబెట్టిన సంగతి తెలిసిందే. దీనిపై పాకిస్థాన్ తీవ్ర ఆరోపణలు చేస్తోంది. తమ భూభాగంపై దాడి జరిగితే తాము చూస్తూ ఊరుకోమని హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇండియన్ ఆర్మీ ఓ ప్రకటన విడుదల చేసింది. పాకిస్థాన్ ఆక్రమించిన భారత భూభాగంలోకి చొరబడి తాము సర్జికల్ స్ట్రయిక్స్ చేశామని ప్రకటించింది. తమదేశ భూభాగంలో ఉగ్రవాదులు తిరిగితే తాము చూస్తూ ఊరుకోమని భారత్ తెలిపింది. ఇతర దేశంపై దాడికి దిగితే దురాక్రమణ అవుతుందని, భారత్ కు చెందిన భూభాగంలోనే సర్జికల్ స్ట్రయిక్స్ జరిపేందుకు భారత్ కు చట్టబద్ధమైన అవకాశం ఉందని అన్నారు.

  • Loading...

More Telugu News