: పాక్ వెన్నులో వణుకు పుట్టించాలి.. పాక్ తీరప్రాంతానికి సమీపంలో ఇండియన్ నేవీ విన్యాసాలు చేయాలని నిర్ణయం
ఇరుదేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో అరేబియా సముద్రంలో పాకిస్థాన్ తీరప్రాంతానికి సమీపంలో ఇండియన్ నేవీ విన్యాసాలను చేపట్టాలని నిర్ణయించుకుంది. సాధారణంగా ప్రతి ఏడాది ‘డిఫెన్స్ గుజరాత్ ఎక్సర్‌సైజ్’ అనే పేరుతో పాక్ తీరుని నిరసిస్తూ ఈ విన్యాసాలు నిర్వహిస్తూ వస్తున్నారు. వాటి ద్వారా చొరబాటుదార్లకు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అయితే, తాజా పరిస్థితుల నేపథ్యంలో ప్రస్తుతం మరోసారి ఈ విన్యాసాలను చేయనున్నారు. దీనికి సంబంధించిన పనుల్లో నేవీ అధికారులు బిజీబిజీగా ఉన్నారు. మొత్తం 36 యుద్ధ నౌకలు, సబ్ మెరైన్లను భారత్ ప్రదర్శించనుంది. జాగ్వార్లు, సుఖోయ్ విమానాలతో పాక్ వెన్నులో వణుకుపుట్టించాలని భావిస్తోంది.