: ఇంకా ఏం చేద్దామో చెప్పండి... అఖిల పక్ష నేతలతో రాజ్ నాథ్ సమావేశం షురూ
పాక్, భారత్ సరిహద్దుల్లో నెలకొన్న ఆందోళనకర పరిస్థితులపై ఢిల్లీలో అఖిలపక్ష భేటీ ప్రారంభమయింది. పాక్ వైఖరి, ఇరు దేశాల మధ్య నెలకొన్న తాజాపరిణామాలు, భద్రత, తదుపరి తీసుకోవాల్సిన చర్యలపై కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన అఖిలపక్ష నేతలు చర్చించి వారి అభిప్రాయాలు, సూచనలు ఇస్తున్నారు. సమావేశానికి వెంకయ్య నాయుడు, మనోహర్ పారికర్, సీతారాం ఏచూరి, శరద్ పవార్, రామ్ విలాస్ పాశ్వాన్, గులాం నబీ ఆజాద్, అమిత్ షా, టీడీపీ నుంచి సీఎం రమేష్ హాజరయ్యారు. మరికొందరు నేతలు సమావేశానికి మరికాసేపట్లో చేరుకోనున్నారు.