: పాకిస్థాన్ అంశంపై చర్చిద్దాం.. వెంటనే మీరూ రండి.. సీఎం కేసీఆర్‌కు రాజ్‌నాథ్‌సింగ్‌ ఫోన్‌


పాకిస్థాన్ స‌రిహ‌ద్దులో ఉన్న భార‌త రాష్ట్రాల్లో చోటు చేసుకుంటున్న తీవ్ర ప‌రిణామాల నేప‌థ్యంలో ఇప్పటికే స‌రిహ‌ద్దు రాష్ట్రాల‌ ముఖ్య‌మంత్రులంద‌రికీ కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ఫోన్ చేసిన విష‌యం తెలిసిందే. ఈరోజు సాయంత్రం 4 గంట‌ల‌కు ఢిల్లీలో నిర్వ‌హించ‌నున్న‌ అఖిల‌ప‌క్ష భేటీలో పాల్గొనాల‌ని ఆయ‌న ముఖ్య‌మంత్రుల‌కు సూచిస్తున్నారు. అందులో భాగంగా తెలంగాణ సీఎం కేసీఆర్‌కు కూడా రాజ్‌నాథ్ సింగ్ కొద్ది సేప‌టి క్రితం ఫోన్‌ చేశారు. పాక్‌ నియంత్రణ రేఖ వద్ద తాజాగా చోటు చేసుకున్న ప‌రిణామాల‌ను ఆయ‌న కేసీఆర్‌కు చెప్పారు. సాయంత్రం నిర్వ‌హించ‌నున్న భేటీలో పాల్గొనాల‌ని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News