: స్టీల్ ప్లాంట్ల ఏర్పాటుపై మంత్రి బీరేందర్ సింగ్ తో వెంకయ్యనాయడు చర్చలు
కేంద్ర ఉక్కు శాఖ మంత్రి బీరేందర్ సింగ్ తో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు గురువారం ఢిల్లీలో సమావేశం అయ్యారు. ఆంధ్రప్రదేశ్ లోని కడప జిల్లాలో, తెలంగాణలోని ఖమ్మం జిల్లా బయ్యారంలో స్టీల్ ప్లాంట్లు ఏర్పాటు విషయమై చర్చించారు. విభజన చట్టం ప్రకారం కేంద్ర ప్రభుత్వం రెండు రాష్ట్రాల్లోనూ సెయిల్ ఆధ్వర్యంలో ఉక్కు కర్మాగారాలను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఈ విషయాన్ని వెంకయ్యనాయుడు మరోసారి ఉక్కు శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ప్లాంట్ల ఏర్పాటుకు ఉన్న అవకాశాలను పరిశీలిస్తామని మంత్రి చెప్పినట్టు సమావేశం అనంతరం వెంకయ్యనాయుడు తెలిపారు.