: తెలుగు రాష్ట్రాల్లో జలాశయాలకు కొనసాగుతున్న వరద.. పూర్తిగా నిండిన శ్రీరాంసాగర్

వర్షాలు తగ్గుముఖం పట్టినా ప్రాజెక్టులకు వరద కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లోని జలాశయాలకు వరద నీరు పెద్ద ఎత్తున వచ్చి చేరుతోంది. కర్నూలు జిల్లాలోని శ్రీశైలం ప్రాజెక్టు ఇన్‌ఫ్లో 24,690 క్యూసెక్కులు కాగా ఔట్ ఫ్లో 24 వేల క్యూసెక్కులు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు. ప్రస్తుతం 882.80 అడుగుల నీటి మట్టంతో కళకళలాడుతోంది. మహబూబ్‌నగర్ జిల్లాలోని జూరాలకు కూడా వరద కొనసాగుతోంది. వచ్చిన వరదను వచ్చినట్టు అధికారులు కిందికి వదులుతున్నారు. ఇన్‌ఫ్లో 1.02 లక్షల క్యూసెక్కులు కాగా మొత్తం నీటిని ఔట్‌ఫ్లో ద్వారా విడిచిపెడుతున్నారు. నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాం సాగర్ ప్రాజెక్టు పూర్తిగా నిండి నిండుకుండను తలపిస్తోంది. ఇన్‌ఫ్లో 1.70 లక్షల క్యూసెక్కులు, ఔట్ ఫ్లో లక్ష క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులు. నిజాం సాగర్‌‌లో ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో 88,700 క్యూసెక్కులుగా ఉంది. పూర్తిస్థాయి నీటిమట్టం 1405 అడుగులు కాగా ప్రస్తుత నీటిమట్టం 1404.5 అడుగులు. మెదక్ జిల్లాలోని సింగూరు ప్రాజెక్టులో ఇన్‌ఫ్లో, ఔట్ ఫ్లో 20 వేల క్యూసెక్కులుగా ఉంది. దీని పూర్తిస్థాయి నీటిమట్టం 29.99 టీఎంసీలు. ప్రస్తుత నీటిమట్టం 28.5 టీఎంసీలు.

More Telugu News