: జూబ్లీహిల్స్‌లోని 'కాక్‌టేల్ పబ్'లో యువకుల వీరంగం.. బౌన్సర్లపై దాడిచేసిన రౌడీషీటర్ అనుచరులు
హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని కాక్‌టేల్ పబ్‌లో బుధవారం రాత్రి కొందరు యువకులు వీరంగం సృష్టించారు. పబ్‌ను తెరవాలంటూ మల్లేపల్లికి చెందిన రౌడీషీటర్ అనుచరులు బౌన్సర్లపై దాడిచేశారు. మూసి ఉన్న పబ్‌ను తెరిచేందుకు బౌన్సర్లు నిరాకరించడంతో యువకులు రెచ్చిపోయారు. బౌన్సర్లను చితకబాదడమే కాకుండా అక్కడున్న వస్తువులను ధ్వంసం చేశారు. అంతేకాదు పబ్‌ను తెరవకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందంటూ హెచ్చరించారు. ఆపై ఇష్టానుసారం బౌన్సర్లపై పిడిగుద్దులు కురిపించారు. అర్ధరాత్రి దాటిన తర్వాత పబ్ తెరిచేందుకు అనుమతి లేదని చెబుతున్నా ఏమాత్రం వినిపించుకోని యువకులు ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు.