: టీడీపీ నేత వసంత కృష్ణప్రసాద్ పై హత్య కేసు కొట్టివేత
మాజీమంత్రి వసంత నాగేశ్వరరావు కుమారుడు, కృష్ణా జిల్లా నందిగామ టీడీపీ నేత వసంత కృష్ణప్రసాద్ పై నమోదైన హత్య కేసును విజయవాడలోని 14వ అడిషనల్ జిల్లా న్యాయస్థానం కొట్టివేసింది. ఈ కేసు పూర్వాపరాలు.. 2013 జూన్ లో కృష్ణా జిల్లా చందర్లపాడు మండలం కోనాయిపాలెంలో బైక్ పై వెళుతున్న రవికుమార్ అనే ఉపాధ్యాయుడిని గుర్తుతెలియని వ్యక్తులు నరికి చంపేశారు. ఈ కేసులో వసంత కృష్ణప్రసాద్ పై ఆరోపణలు రావడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. రవికుమార్ తో కృష్ణప్రసాద్ కు ఎటువంటి విభేదాలు లేవని, ఆయనపై ప్రత్యర్థులు మోపిన అభియోగాలపై సరైన సాక్ష్యాధారాలు చూపలేదని భావించిన న్యాయస్థానం ఈ కేసును కొట్టివేసింది.