: శాడిస్టు భర్త... బెడ్ రూమ్, బాత్రూముల్లో సీసీ కెమెరాలు పెట్టి భార్యను వేధిస్తున్న వ్య‌క్తి


హైద‌రాబాద్ మాస‌బ్ ట్యాంక్‌లో ఓ శాడిస్ట్ భ‌ర్త చేస్తోన్న నిర్వాకం తాజాగా వెలుగులోకొచ్చింది. ఆ ప్రాంతంలో నివాసం ఉండే శివ‌శంక‌ర్‌తో పది నెలల క్రితం పూర్ణ‌జ్యోతి అనే యువ‌తికి పెళ్లి అయింది. వివాహం జ‌రిగిన కొన్ని రోజుల నుంచే శివ‌శంక‌ర్‌ శాడిస్టులా మారి పూర్ణ‌జ్యోతికి న‌ర‌కం చూపించాడు. బెడ్ రూమ్, బాత్రూముల్లో సీసీ కెమెరాలు పెట్టాడు. తాను ప‌డుతున్న చిత్ర‌హింస‌ల ప‌ట్ల పూర్ణ‌జ్యోతి మీడియాకు తెలుపుతూ.. శివ‌శంక‌ర్‌ త‌న‌ చెల్లిని కూడా ఇచ్చి పెళ్లి జ‌రిపించాలంటూ వేధిస్తున్నాడ‌ని చెప్పింది. మొద‌ట త‌న త‌ల్లిదండ్రులకు ఈ విష‌యాలు చెప్ప‌లేద‌ని ఈ మ‌ధ్య వేధింపులు మ‌రీ ఎక్కువ‌వుతుండ‌డంతో చివ‌రికి చెప్పాన‌ని పేర్కొంది. త‌న అత్త‌య్య మాట‌లు వింటూ త‌న భ‌ర్త ఈ దారుణాల‌కు దిగుతున్నాడ‌ని ఆమె ఆవేద‌న వ్య‌క్తం చేసింది. అద‌న‌పు క‌ట్నం కూడా తీసుకురావాల‌ని డిమాండ్ చేస్తున్న‌ట్లు తెలిపింది.

  • Loading...

More Telugu News