: సార్క్ సమ్మిట్ కు భారత్ దూరం.. అదే బాటలో మరో మూడు దేశాలు
వచ్చే నవంబర్ లో పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్ లో జరగనున్న సార్క్ శిఖరాగ్ర సమావేశానికి భారత్ దూరంగా ఉండనుంది. ఈ సమావేశంలో ప్రధాని మోదీ పాల్గొనడం లేదని కేంద్ర విదేశాంగ శాఖ ఒక ప్రకటన చేసింది. కాగా, భారత్ బాటలోనే బంగ్లాదేశ్, భూటాన్, ఆఫ్గనిస్తాన్ దేశాలు కూడా నడవనున్నాయి. జమ్మూకాశ్మీర్ లోని యూరీ సెక్టార్ ఘటన నేపథ్యంలోనే భారత్ తో పాటు ఈ మూడు సార్క్ దేశాలు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ నాలుగు దేశాల నిర్ణయంతో దౌత్యపరంగా పాకిస్థాన్ కు ఇబ్బందులు తప్పవని నిపుణులు అంటున్నారు.