: ఇప్పటి చిత్రాల్లో తాకినా..గోకినా.. పీకినా శృంగారం పండటం లేదు: వెంకయ్యనాయుడు


‘పాత సినిమాల్లో కళ్లతో, ముఖ కవళికలతో, కనుబొమ్మలతో శృంగారం ఒలికించేవారు.. ఒకరినొకరు తాకేవాళ్లు కాదు. ఇప్పటి చిత్రాల్లో.. తాకినా.. గోకినా.. పీకినా కూడా శృంగారం పండటం లేదు’ అని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు చమత్కరించారు. రామోజీ ఫిలిం సిటీలో జరుగుతున్న ‘ఇండీవుడ్’ ఫిల్మ్ కార్నివాల్ లో ఆయన మాట్లాడుతూ, ‘ఇప్పటి చిత్రాల్లో ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందనే విషయమై ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది. శృంగారం జీవితంలో ఒక భాగం, దాని గురించి ఎవరూ కంగారు పడాల్సిన అవసరం లేదు. అయితే, శృంగారం, సౌందర్యం గురించి చిత్రాల్లో చూపించేటప్పుడు సంస్కారవంతంగా ఉండాలి. అటువంటి సంస్కారవంతమైన చిత్రాలను తీసేవాళ్లకు మనందరం నమస్కారం పెట్టాలి’అని వెంకయ్యనాయుడు అన్నారు.

  • Loading...

More Telugu News