: తైవాన్‌ను వణికిస్తున్న మేగీ పెను తుపాను.. సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లిన వేలాది మంది
మేగీ పెను తుపాను తైవాన్‌ను వణికిస్తోంది. తుపాను ధాటికి అక్కడి ప్రజలు భయం గుప్పిట బతుకుతున్నారు. గంటకు 162 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తున్నాయి. భవనాలపై ఉన్న హోర్డింగులు ఊడిపడుతున్నాయి. చెట్లు, విద్యుత్ స్తంభాలు నేల కూలుతున్నాయి. తుపాను కారణంగా అక్కడి పాఠశాలలు, కార్యాలయాలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. వేలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించింది. సహాయక చర్యలు చేపట్టడానికి భద్రతా బలగాలు రంగంలోకి దిగాయి. సురక్షిత ప్రాంతాలకు వెళ్లిన వారికి నిత్యావసర సరుకులు అందిస్తున్నారు.