: తన బ్యాగును ఎలుక కొరికేసిందని రైల్వే మంత్రికి ఫిర్యాదు చేసిన నటి


ఈనెల‌ 22న లాతూర్ ఎక్స్ప్రెస్ లో ఏసీ బోగీలో మరాఠి నటి నివేదిత సరాఫ్ ప్రయాణించింది. రైలులో తాను నిద్ర‌పోతున్న స‌మ‌యంలో త‌న బ్యాగును తల పక్కన పెట్టుకుని నిద్రపోయింది. మేల్కొన్న త‌రువాత బ్యాగుని చూస్తే దాన్ని ఎలుక కొరికేసిన‌ట్లు గ్ర‌హించింది. దీంతో ఆమె ట్విట్ట‌ర్ వేదిక‌గా రైల్వే మంత్రి సురేశ్ ప్రభుకు ఫిర్యాదు చేశారు. రైలు ప్రయాణం చేయ‌డం తనకు చేదు అనుభవంగా మిగిలింద‌ని పేర్కొంది. ఈ సంద‌ర్భంగా ఆమె ఎలుక కొరికిన బ్యాగు ఫొటోను కూడా ట్విట్ట‌ర్‌లో పెట్టింది. న‌టి చేసిన‌ ట్వీట్ ఫిర్యాదుపై స్పందించిన‌ సెంట్రల్ రైల్వే చీఫ్ పీఆర్వో నరేంద్ర పాటిల్ రైళ్ల‌లో తిరిగే ఎలుకలను పట్టుకోవడం కోసం ఏర్పాటు చేసిన‌ సిబ్బంది ఎప్పటికప్పుడు వాటిని అరికడతారని పేర్కొన్నారు. మ‌రో అధికారి స్పందిస్తూ.. రైలు ప్రయాణికులు చేస్తోన్న‌ ఫిర్యాదులపై వెంటనే స్పందిస్తున్నామని తెలిపారు. మ‌రింత స‌మ‌ర్థంగా ప‌ని చేయాల‌ని సిబ్బందిని ఆదేశిస్తామ‌ని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News