: రెండో రోజు నాలాలపై అక్రమనిర్మాణాల తొలగింపు పనులు షురూ.. భారీగా పోలీసు బందోబస్తు
హైదరాబాద్ నగరంలో నాలాలను ఆక్రమించి ఇళ్లు, అపార్టుమెంటులు నిర్మించిన కారణంగా వర్షపు నీరు ఇళ్లలోకి చేరడంతో అక్రమనిర్మాణాలను కూల్చే పనిలో జీహెచ్ఎంసీ సిబ్బంది, సంబంధిత అధికారులు రెండోరోజు కూడా రంగంలోకి దిగారు. నాలాల ఆక్రమణలకు సంబంధించిన పక్కా ఆధారాలతో చేరుకున్న వారు కూల్చివేతలను అడ్డుకుంటే డాక్యుమెంట్లను చూపాలని భావిస్తున్నారు. శేరిలింగంపల్లి ప్రాంతంలో ఈరోజు కూడా ఆక్రమణలను తొలగిస్తున్నారు. మరోవైపు మియాపూర్, దీప్తిశ్రీనగర్ ప్రాంతాల్లోనూ రెండు కిలోమీటర్ల మేర నాలాలపై ఉన్న అక్రమ నిర్మాణాలను తొలగిస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో భారీగా పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. అక్రమ నిర్మాణాల కూల్చివేతకు అడ్డుపడవద్దని ఎమ్మెల్యేలకు తెలంగాణ సర్కార్ సూచించింది. జీహెచ్ఎంసీ సిబ్బంది నిన్న కూడా నగరంలోని శేరిలింగంపల్లి, మదీనాగూడ, గచ్చిబౌలి నుంచి కొత్తగూడ, ఉప్పల్, రామంతాపూర్, చిలుకానగర్ ప్రాంతాల్లో అక్రమ నిర్మాణాలను తొలగించిన విషయం తెలిసిందే.