: చంద్రబాబును కలిసిన ఇస్రో అధికారులు.. ఇస్రో సమాచార వినియోగానికి ప్రణాళిక


ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడును సోమవారం ఇస్రో అధికారులు కలిశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ఇస్రో అందించే సమాచారాన్ని రాష్ట్రంలో విస్తృతంగా వాడుకునేందుకు ప్రత్యేకంగా ప్రణాళిక రూపొందించనున్నట్టు పేర్కొన్నారు. అమరావతిలో ఏర్పాటు చేయబోతున్న కమాండ్ కంట్రోల్ రూమ్‌లో ఇస్రో తరపున ఓ నిపుణుడిని నియమించాలని ఇస్రో అధికారులను చంద్రబాబు కోరారు. విశ్వవిద్యాలయాలు, శాస్త్ర, సాంకేతిక సంస్థలతో కలిసి పనిచేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. ఈ సందర్భంగా పీఎస్‌ఎల్‌వీ ప్రయోగం విజయవంతంపై అధికారులను చంద్రబాబు అభినందించారు.

  • Loading...

More Telugu News