: గుంటూరు డివిజన్ మార్గంలో.. 28,29 తేదీల్లో పలు రైళ్లు రద్దు


ఏపీ లో ఎడతెరిపి లేని వర్షాల కారణంగా రహదారులు, రైల్వే ట్రాక్ లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో గుంటూరు డివిజన్ మార్గంలోని రైల్వే ట్రాక్ మరమ్మతులు నిర్వహించనున్నారు. ఈ కారణంగా ఆ మార్గంలో ప్రయాణించే కొన్ని రైళ్లను ఈ నెల 28, 29 తేదీల్లో రద్దు చేయనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. సత్తెనపల్లి- పిడుగురాళ్ల ట్రాక్ పనుల కారణంగా కొన్ని రైళ్లను రద్దు చేయనుండగా, మరికొన్ని రైళ్లను పాక్షికంగా రద్దు చేయాల్సి వచ్చిందని అధికారులు పేర్కొన్నారు. ఆ తేదీల్లో రద్దయిన రైళ్ళ వివరాలు...విజయవాడ నుంచి బయలుదేరే విజయవాడ-సికింద్రాబాద్, సికింద్రాబాద్ స్టేషన్ నుంచి బయలు దేరే సికింద్రాబాద్- విజయవాడ ఇంటర్ సిటీ ఎక్స్ ప్రెస్, గుంటూరు- వికారాబాద్, వికారాబాద్-గుంటూరు పల్నాడ్ ఎక్స్ ప్రెస్, మిర్యాలగూడ-పిడుగురాళ్ల, పిడుగురాళ్ల- మిర్యాలగూడ, గుంటూరు-మాచర్ల ప్యాసింజర్, నడికుడి- మాచర్ల ప్యాసింజర్ రైళ్లను రద్దు చేశారు. 28, 29 తేదీల్లో పాక్షికంగా రద్దయిన రైళ్ల విషయానికొస్తే.. కాచిగూడ- రేపల్లె (డెల్టా ప్యాసింజర్)ను రద్దు చేసి, ఆ స్థానంలో గుంటూరు-రేపల్లె వరకు, భీమవరం-మాచర్ల రైలును రద్దు చేసి దాని స్థానే గుంటూరు-భీమవరం వరకు, సికింద్రాబాద్-రేపల్లె ప్యాసింజర్ ను రద్దు చేసి గుంటూరు- రేపల్లె వరకు మాత్రమే ఆయా రైళ్లను నడపనున్నారు.

  • Loading...

More Telugu News