: వైద్యులకు అంతుచిక్కని స్వీడన్ వ్యక్తి!


స్వీడన్ కు చెందిన ఓ వ్యక్తి వైద్యులుకు అంతుచిక్కని ప్రశ్నగా మిగిలాడు. వివరాల్లోకి వెళ్తే... గత నవంబర్ లో స్వీడన్ ను మంచు తుపాను ముంచెత్తింది. ఈ సమయంలో పీటర్ స్పిల్ బర్గ్ అనే వ్యక్తి పనిమీద బయటకు వెళ్లి మంచు తుపానులో చిక్కుకుపోయాడు. తుపాను కారణంగా కురుస్తున్న మంచు తీవ్రతకు కారును ఆయన నడపలేకపోయాడు. దీంతో -30 డిగ్రీల సెంటీగ్రేడ్ లో కారులో చిక్కుకుపోయాడు. దీంతో నెమ్మదిగా ఆయన అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. ఆయన కారుపై మంచు పేరుకుపోవడంతో బయటివారికి కూడా ఆయన కారు కనిపించలేదు. గత జనవరిలో కొంత మంది ఔత్సాహికులు స్కీయింగ్ కు వెళ్లి ఈ కారును, అందులోని పీటర్ స్పిల్ బర్గ్ ను గుర్తించారు. దీంతో ఆయనను హుటాహుటీన ఆసుపత్రిలో చేర్చగా, సుదీర్ఘకాలం అపస్మారక స్థితిలో ఉన్న ఆయనకు వైద్యులు చికిత్స చేశారు. సుదీర్ఘ చికిత్స అనంతరం ఆయన కోలుకున్నాడు. దీంతో రెండు నెలలపాటు ఓ వ్యక్తి -30 డిగ్రీల సెంటీగ్రేడు చలిలో అపస్మారక స్థితిలో ఉండడం, తిరిగి కోలుకోవడంతో వైద్యులు ఆశ్చర్యానికి లోనయ్యారు.

  • Loading...

More Telugu News