: పోలీసు వ్యానే లక్ష్యంగా పాకిస్థాన్‌లో బాంబు పేలుడు
పాకిస్థాన్‌లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. చార్సద్దాలో పోలీసు వ్యానే లక్ష్యంగా బాంబు దాడి చేశారు. ఘటనలో నలుగురు పోలీసులు సహా మొత్తం తొమ్మిది మంది బాటసారులు గాయపడ్డారు. ఈరోజు సారోకల్లే ప్రాంతంలో వ్యాన్‌లో అక్కడి పోలీసులు పెట్రోలింగ్ చేస్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. దుండగులు రిమోట్‌తో బాంబును పేల్చినట్లు పోలీసులు తెలిపారు. దాడిలో గాయపడ్డ వారిని పోలీసులు ఆసుపత్రికి తరలించారు. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు.