: పటిష్టమైన కివీస్ పై గెలిచిన టీమిండియా ఆత్మస్థైర్యాన్ని పోగుచేసుకుంది: ఎమ్మెస్కే ప్రసాద్


పటిష్టమైన కివీస్ జట్టుపై టీమిండియా గెలవడం ద్వారా ఆత్మస్థైర్యాన్ని పెంచుకుందని బీసీసీఐ చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ అన్నారు. కాన్పూర్ వేదికగా కివీస్ తో జరిగిన 500వ టెస్టులో భారతజట్టు విజయం సాధించడంపై ఆయన ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ మ్యాచ్ లో అశ్విన్, జడేజా,పూజారా, విజయ్, రోహిత్ శర్మ అద్భుతంగా రాణించారని.. టీమిండియా సమష్టి కృషితోనే ఈ విజయం సాధ్యమైందని అన్నారు. ఇదే స్ఫూర్తితో ప్రస్తుత సీజన్ లో స్వదేశంలో ఆడే మ్యాచ్ లన్నింటినీ గెలిచి, టెస్టుల్లో నంబర్ వన్ ర్యాంక్ ను టీమిండియా సొంతం చేసుకుంటుందని ఎమ్మెస్కే ప్రసాద్ దీమా వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News