: కాశ్మీర్ లోని అన్ని ప్రాంతాల్లో కర్ఫ్యూ ఎత్తివేత
హిజ్బుల్ ముజాహిద్దీన్ కమాండర్ బుర్హన్ వని ఎన్ కౌంటర్ నేపథ్యంలో చెలరేగిన అల్లర్ల కారణంగా కాశ్మీర్ లో కర్ఫ్యూ కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం పరిస్థితి చక్కబడటంతో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో కర్ఫ్యూ ఎత్తివేస్తున్నట్లు భద్రతా దళాలు ప్రకటించాయి. ఈ మేరకు ఒక ప్రకటన చేశాయి. అయితే, భద్రతా కారణాల దృష్ట్యా కొన్ని ఆంక్షలు విధించినట్లు, ప్రజలు గుంపులుగా ఎక్కడా తిరగకూడదనే నిబంధనను మాత్రం అమలు చేయనున్నారు. ఈ ప్రాంతంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదని నిన్న నివేదికలు అందడంతో కర్ఫ్యూ ఎత్తివేయాలనే నిర్ణయానికి వచ్చినట్లు ఆ ప్రకటనలో పేర్కొన్నారు.