: ‘మిడ్ మానేరు’కు గండి.. లోతట్టు ప్రాంతాల ప్రజలు తరలింపు
తెలంగాణలో వర్షాల కారణంగా కరీంనగర్ జిల్లాలోని మానేరు డ్యాంలోకి వరదనీరు భారీగా చేరుతోంది. దీంతో, నిర్మాణదశలో ఉన్న ‘మిడ్ మానేరు’ మట్టికట్ట కొట్టుకుపోవడంతో గండిపడింది. దీంతో లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. కొదురుపాక, మన్వాడ, రుద్రవరం గ్రామాలను అధికారులు ఖాళీ చేయిస్తున్నారు. 50 కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు ఇప్పటికే తరలించారు. గండిపడిన కారణంగా సిరిసిల్ల-కరీంనగర్ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. గండిపడ్డ ప్రాంతానికి కలెక్టర్ నీతు కుమారి ప్రసాద్ చేరుకున్నారు. సహాయక చర్యలు ప్రారంభమయ్యాయి.