: సినిమాల్లో అవకాశాల పేరుతో వ్యభిచారంలోకి.. తమిళనాడులో నెల్లూరు వ్యక్తి అరెస్ట్
సినిమాల్లో అవకాశాల పేరుతో మహిళలను వ్యభిచారంలోకి దింపుతున్న వ్యక్తిని తమిళనాడు పోలీసులు అరెస్ట్ చేశారు. సినిమాల్లో చాన్స్‌ల పేరుతో మహిళలను మభ్యపెట్టి వ్యభిచార కూపంలోకి దింపుతున్నట్టు తమిళనాడులోని కాంచీపురం జిల్లా మధురవాయల్ పోలీసులకు పలు ఫిర్యాదులు అందాయి. దీంతో రంగంలోకి దిగిన ప్రత్యేక బృందం పలు ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టింది. ఈ క్రమంలో మధురవాయల్‌లోని కృష్ణానగర్‌లో ఓ ఇంట్లో గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం జరుగుతోందన్న సమాచారంతో పోలీసులు దాడిచేశారు. ముగ్గురు యువతులు సహా నెల్లూరు జిల్లాకు చెందిన మోహన్‌రెడ్డి(48), తమిళనాడులోని తేని జిల్లా ముళ్లై నగర్‌కు చెందిన గణేశ్‌రాజ(31)ని అరెస్ట్ చేశారు. మోహన్‌రెడ్డి గతంలోనూ ఇటువంటి కేసుల్లో పోలీసులకు చిక్కడం గమనార్హం.