: జగన్ ఆరోపణలపై చంద్రబాబు ఆగ్రహం
పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో నిర్వహించిన యువభేరి సభలో వైఎస్సార్సీపీ అధినేత జగన్ చేసిన వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడలో ఆయన మాట్లాడుతూ, తనకు ఇంగ్లీషు రాదని ప్రతిపక్ష నేత పేర్కొనడం హాస్యాస్పదమని అన్నారు. జగన్ మీటింగులకు వెళితే జైలుకు ఎలా వెళ్లాలి? మోసాలు ఎలా చేయాలి? అన్నవి నేర్పుతారని ఆయన ఎద్దేవా చేశారు. కొన్ని కేసుల్లో కోర్టులు చివాట్లు పెట్టినా వారిలో మార్పురాలేదని ఆయన మండిపడ్డారు. ప్రత్యేకహోదా రావాలని తనకూ ఉందని, అయితే రాష్ట్ర ప్రయోజనాల కోసమే ప్యాకేజీకి అంగీకరించానని ఆయన తెలిపారు. ఎవరైనా సరే తప్పుదోవలో డబ్బు సంపాదిస్తే జైలుకు పోతారని ఆయన అన్నారు.