: ప్రత్యేకహోదాపై బహిరంగ చర్చకు జగన్ తో చంద్రబాబు సిద్ధమా?: వైసీపీ నేత పార్థసారధి సవాల్
ప్లేస్ మీరు చెప్పినా, నన్ను చెప్పమన్నా.. టైమ్ మీరు చెప్పినా, నన్ను చెప్పమన్నా.. సింగిల్ గా వచ్చినా, గ్యాంగ్ తో వచ్చినా?.. ఎనీ సెంటర్, ఎనీ టైం అంటూ ఓ సినీ హీరో చెప్పిన డైలాగును వైఎస్సార్సీపీ నేత పార్థసారధి ఈరోజు వల్లించారు. విజయవాడలో ఆయన మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేకహోదాపై వైఎస్సార్సీపీ అధినేత జగన్ తో బహిరంగచర్చకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సిద్ధమా? అని అయన సవాల్ విసిరారు. దీనికి అంగీకరిస్తే విజయవాడలో అయినా, కుప్పంలో అయినా చర్చకు సిద్ధమని ఆయన తెలిపారు. జగన్ నిర్వహించిన యువభేరి కార్యక్రమంతో చంద్రబాబు గూబగుయ్యిమందని ఆయన అన్నారు. యువత మొత్తం చంద్రబాబును ఛీ కొడుతున్నారని ఆయన తెలిపారు. ప్రత్యేకహోదా బదులు ప్యాకేజీకి అంగీకారం తెలపడం, ఉద్యోగావకాశాలు కల్పించకపోవడంపై యువత మండిపడుతున్నారని ఆయన అన్నారు.