: ఇన్ ఫ్రా, రియల్టీ రంగాల్లో మరిన్ని విదేశీ పెట్టుబడులకు తలుపులు బార్లా!


ఇండియాలో మౌలిక వసతుల రంగంతో పాటు నిర్మాణ రంగంలో పెట్టుబడులు పెట్టాలని భావించే వారిని మరింతగా ఆకర్షించేలా కీలక నిర్ణయాలు తీసుకునేందుకు సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) నేడు సమావేశమైంది. ఇన్వ్ ఐటీస్ (ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్ మెంట్ ట్రస్ట్స్), ఆర్ఈ ఐటీస్ (రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్ మెంట్ ట్రస్ట్స్ లకు ప్రస్తుతమున్న అవధులను మరింత పెంచుతూ, ఆపై ఎఫ్పీఐ (ఫారిన్ పోర్ట్ ఫోలియో ఇన్వెస్టర్లు)లను ప్రత్యక్ష డెట్ మార్కెట్లోకి అనుమతిస్తూ, సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు ఇప్పటికే కన్సల్టేషన్ పేపర్ విడుదల చేసి, పలువురి అభిప్రాయాలను స్వీకరించిన సెబీ, దీనిపై చర్చ జరిపి తన సిఫార్సులను కేంద్రానికి పంపనుంది. అధికార వర్గాల సమాచారం ప్రకారం, కేటగిరీ 1, 2 లోని ఎఫ్పీఐలు ఇకపై ఎలాంటి బ్రోకర్ మధ్యవర్తిత్వం లేకుండా డెట్ మార్కెట్ లావాదేవీల్లో పాల్గొనవచ్చు. ఇక కేటగిరీ 3 పెట్టుబడిదారులు స్టాక్ ఎక్స్ఛేంజ్ ల ఈ-బుక్ ప్లాట్ ఫాం మాధ్యమంగా లావాదేవీలు జరిపేందుకు అనుమతించాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఇన్వ్ ఐటీల తప్పనిసరి స్పాన్సర్ పరిమితిని 15 శాతానికి తగ్గించాలని కూడా సెబీ సిఫార్సు చేయనున్నట్టు సమాచారం.

  • Loading...

More Telugu News