: చెట్ల ఆకులను చాక్లెట్లలా తినేస్తున్న రెండేళ్ల చిన్నారి!

మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్ కు చెందిన రెండేళ్ల ఆ చిన్నారి పేరు అనన్య. బిస్కెట్లు, జెమ్స్, ఫైవ్ స్టార్ చాక్ లెట్ల కంటే ఇష్టంగా ఆకులు తినేస్తుంది. ముఖ్యంగా వేప ఆకులు, కాకరకాయలను లొట్టలేస్తూ తినేస్తుంది. కేవలం ఇవే కాదు, మామిడి, తులసి ... ఇలా ఏ చెట్టు ఆకులు అయినా తినేస్తుందని చిన్నారి తండ్రి అమర్ సింగ్ చెబుతున్నాడు. అనన్యకు ఈ అలవాటు ఎలా వచ్చిందనే విషయమై ఆయన మాట్లాడుతూ, చెట్ల ఆకులు తింటుంటే చిన్న పిల్ల కదా, తెలియక చేస్తోందనుకున్నామని చెప్పారు. అలా చేయవద్దంటూ చెప్పి, ఆమె చేతిలోని ఆకులను లాగేస్తే ఏడుస్తుందని, ఆకులు తినకుండా అనన్య ఉండలేకపోతోందని వాపోయారు. ఈ అలవాటు మాన్పించకపోతే చాలా ప్రమాదమని స్థానిక వైద్యులు హెచ్చరించారని ఆవేదన వ్యక్తం చేశాడు. ముంబయి తీసుకువెళ్లి అనన్యకు మెరుగైన వైద్యం చేయిస్తామని అమర్ సింగ్ తెలిపారు.

More Telugu News