: ‘భండారి లే అవుట్’లో ఎటుచూసినా మోకాలి లోతు నీళ్లు
హైదరాబాద్ నిజాంపేట్ లోని భండారి లే అవుట్ ప్రాంతంలో ఎటు చూసినా మోకాలి లోతు నీళ్లు కనపడుతున్నాయి. గత నాలుగు రోజులుగా ఇక్కడ ఇదే పరిస్థితి ఉండటంతో ఇళ్లల్లో నుంచి ఎవరూ బయటకు రావడం లేదు. విద్యుత్ మీటర్లు, ట్రాన్స్ ఫార్మర్లు కూడా నీటిలో మునిగిపోవడంతో కరెంట్ సరఫరా నిలిపివేశారు. మంచినీళ్లు లేక బాధపడుతున్నామని కొంతమంది, పిల్లలు, వృద్ధుల పరిస్థితి దారుణంగా ఉందని మరికొంతమంది వాపోతున్నారు. దీనికి తోడు, నిజాంపేట చెరువుకు గండి కొడతారన్న వదంతులతో ప్రజలు మరింత భయపడుతున్నారు. అదేకనుక జరిగితే చాలావరకు కాలనీలు పూర్తిగా నీటమునిగే ప్రమాదం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.