: కడప జిల్లాలో పరవళ్లు తొక్కుతున్న కుందు నది
కడప జిల్లాలో కుందు నది పరవళ్లు తొక్కుతోంది. భారీగా వరదనీరు వచ్చి చేరుతుండటంతో నది మట్టం క్రమేపీ పెరుగుతోంది. దీంతో, నది మట్టం ప్రమాదకరస్థాయి చేరే అవకాశాలున్నాయని అధికారులు చెబుతున్నారు. కర్నూల్ జిల్లాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా రాజోలి ఆనకట్ట వద్ద 6047 క్యూసెక్కుల వరద ప్రవాహం ఉండగా, ఈ రోజు ఉదయానికి 11,335 క్యూసెక్కులు, మధ్యాహ్నానికి 12 వేల క్యూసెక్కులకు చేరింది. కుందునదిలో వరద నీటి ప్రవాహాన్ని అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.