: పూర్తిగా నిండిన హుస్సేన్ సాగర్.. అశోక్ నగర్ నాలా వాసులకు జీహెచ్ఎంసీ హెచ్చరిక


హైదరాబాద్ లో కురుస్తున్న ఎడతెరిపిలేని వర్షాలకు హుస్సేన్ సాగర్ పూర్తిగా నిండిపోయింది. ఈ నేపథ్యంలో అశోక్ నగర్ నాలా వాసులు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని జీహెచ్ఎంసీ అధికారులు హెచ్చరించారు. హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో నాలాలు పొంగిపొర్లుతున్నాయి. వర్షం కారణంగా రహదారులు జలమయం అయ్యాయి. పాతబస్తీలోని యాకత్ పురా ఎస్ఆర్ టీ కాలనీలో ఉన్న పురాతన భవనం కూలింది. అయితే, భవనంలో ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. చంపాపేట్ లోని ఒక ఇంటి గోడ కూలింది.

  • Loading...

More Telugu News