: హైదరాబాద్‌లో ప్రస్తుత పరిస్థితికి టీడీపీ, కాంగ్రెస్‌లే కారణం: టీఆర్ఎస్ నేత కర్నె ప్రభాకర్
హైదరాబాద్ నగరం చినుకుపడితే చిత్తడిగా మారుతోందని, విశ్వనగరం ఇదేనా? అంటూ ప్రతిపక్ష పార్టీలు కేసీఆర్ ప్రభుత్వంపై చేస్తోన్న వ్యాఖ్యలను టీఆర్ఎస్ నేత, ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ తిప్పికొట్టారు. ఈరోజు హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ... నగరంలో ఏర్పడిన పరిస్థితికి తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ పార్టీలే కారణమని అన్నారు. భాగ్యనగరానికి ఆ పార్టీలు శనిలా దాపురించాయని అన్నారు. గతంలో అధికారంలో ఉన్న ఆ పార్టీలు రియల్ ఎస్టేట్ వ్యాపారులు చేస్తోన్న అక్రమాలను అరికట్టలేకపోయాయని, వారు చెరువులు కబ్జా చేస్తుంటే చూస్తూ ఉండిపోయారని ఆరోపించారు. నాడు నగరాన్ని బాగు చేసుకోవాలనే ఆలోచనే చేయనివారు రెండేళ్లలోనే టీఆర్ఎస్ బాగుచేయలేదని అనడం ఏంటని ఆయన ప్రశ్నించారు.