: 0, 9, 18, 32... ఇవి మనవాళ్ల పరుగులు, భారీ స్కోరు చేయడంలో భారత్ విఫలం!


కీపర్ బ్యాట్స్ మెన్ వృద్ధిమాన్ సాహా డక్కౌట్. కెప్టెన్ విరాట్ కోహ్లీ 9, ఆశలు పెట్టుకున్న ఆల్ రౌండర్ రహానే 18, ఓపెనర్ కేఎల్ రాహుల్ 32... ఇలా సాగాయి భారత ఆటగాళ్ల వ్యక్తిగత పరుగులు. కాన్పూర్ వేదికగా, న్యూజిలాండ్ తో తన 500వ టెస్టు మ్యాచ్ ఆడుతున్న భారత జట్టు భారీ స్కోరును ప్రత్యర్థి ముందుంచడంలో విఫలమైంది. మురళీ విజయ్ (65), పుజారా (62) మినహా మరెవరూ చెప్పుకోతగ్గ స్కోరు చేయలేదు. ప్రస్తుతం అశ్విన్ 36, జడేజా 6 పరుగులతో క్రీజులో ఉండగా, భారత స్కోరు 85 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 269 పరుగులు. న్యూజిలాండ్ బౌలర్లలో సాట్నర్ రాణించి 3 వికెట్లు తీసుకోగా, బోల్ట్, వాగ్నర్, క్రెయిగ్, సోధీలకు తలా ఓ వికెట్ దక్కింది. మరో 5 ఓవర్లలో నేటి ఆట ముగియనుంది.

  • Loading...

More Telugu News