: ముంబయ్ సమీపంలోని ఉరాన్‌లో నల్లదుస్తులు ధరించిన అనుమానితుల సంచారం.. హై అలర్ట్


మహారాష్ట్రలోని ముంబయ్ సమీపంలోని ఉరాన్‌లో అనుమానితులు సంచ‌రిస్తున్నార‌ంటూ ప‌లువురు విద్యార్థులు ఇచ్చిన‌ స‌మాచారం క‌ల‌క‌లం రేపుతోంది. ఉరాన్ ప్రాంతంలోని నౌకాదళ స్థావరం వద్ద నల్లదుస్తులు ధరించి, మార‌ణాయుధాలతో కనిపించారని ఆ ప్రాంతంలో ఉన్న రెండు పాఠ‌శాలల‌ విద్యార్థులు తెలిపారు. మొత్తం ఆరుగురిని తాము చూసినట్లు పేర్కొన్నారు. స్థానిక పోలీస్ స్టేష‌న్‌లో ఈ అంశంపై కేసు న‌మోదైంది. అనుమానితులు ఉగ్ర‌వాదులా? అన్న అనుమానాన్ని వ్య‌క్తం చేస్తున్న పోలీసులు గాలింపు చ‌ర్య‌లు చేప‌ట్టారు. ఆ ప్రాంతంలో హై అల‌ర్ట్ ప్ర‌క‌టించారు.

  • Loading...

More Telugu News