: 9 పరుగులకే ఔట్... నిరాశపరిచిన కోహ్లీ
కాన్పూర్ లో జరుగుతున్న ప్రతిష్ఠాత్మక భారత 500వ టెస్టులో కెప్టెన్ విరాట్ కోహ్లీ స్వల్ప స్కోరుకే నిష్క్రమించి నిరాశపరిచాడు. 154 పరుగుల వద్ద పుజారా (62) ఔట్ కావడంతో మైదానంలోకి వచ్చిన కోహ్లీ, 10 బంతులు ఆడి రెండు ఫోర్ల సాయంతో 9 పరుగులు చేసి, వాగ్నర్ బౌలింగ్ లో సోధీకి క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. దీంతో క్రీజులో కుదురుకుని ఆడుతున్న మురళీ విజయ్ కి జతగా రహానే వచ్చి కలిశాడు. ప్రస్తుతం రహానే 7, మురళీ విజయ్ 64 పరుగులతో ఆడుతున్నారు. భారత స్కోరు 54 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 179 పరుగులు.